
* భూ తగాదాలే కారణం..?
ఆకేరున్యూస్ వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ పరిధిలోని అగ్రహారం వద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి మాజీ కౌన్సిలర్ రమేష్ (48)ను గుర్తు తెలియని వ్యక్తులు కారులోనే గొంతుకోసి హత్య చేశారు. రమేష్ హత్యకు భూ తగాదాలే కారణమని భావిస్తున్నారు. గతంలో భూ తగాదాల విషయంలో రమేష్ పలుమార్లు జైలుకు వెళ్లినట్లు తెలుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసునమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
……………………………………………