
ఆకేరు న్యూస్ డెస్క్ : గుజరాత్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రుపానీ మృతి చెందారు. విజయ్ రూపానీ ఆగస్టు 3 1956లో జన్మించారు. తొలినాళ్లలో వ్యాపారం చేశారు.
ఆ తరువాత ఆయన స్టాక్ బ్రోకర్ గా పనిచేశారు,అంతకు మందు ఆయన ఏబీవీపీ విద్యార్థి విభాగంలో చురుకుగా పనిచేశారు.ఆ తరువాత ఆయన 1971లో జనసంఘ్‌లో చేరారు. ఆ తరువాత ప్రారంభించబడిన భారతీయ జనతా పార్టీలో ప్రారంభం నుంచి ఉన్నారు. 1976లో ఆయన ఎమెర్జెన్సా కాలంలో జైలుశిక్ష అనుభవించారు. 1987లో రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. 1996 నుండి 97 వరకు రాజ్కోట్మేయర్ గా పనిచేశారు.1998లో ఆయన గుజరాత్ యూనిట్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. 2006లో ఆయన గుజరాత్ టూరిజం చైర్మన్‌గా పనిచేశారు2014లో ఆయన గుజరాత్ శాసనసభకు ఎన్నికయ్యారు.ఆనందీపటేల్ మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేశారు. ఆతరువాత ఆయన ఆనందీ పటేల్ స్థానంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.2016 నుంచి 2021 వరకు ఆయనగుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
……………………………………………..