CM రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు..మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్
* రేవంత్‌కు కేటీఆర్ కౌంటర్
* చిల్లర మాటలు తప్ప చేసిందేమీ లేదని విమర్శ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ‘‘చీర కట్టుకుని ఆడపిల్లలా మంచిగా రెడీ అయి.. ఆర్టీసీ బస్సు ఎక్కు..ఆరు గ్యారెంటీలు అమలవుతున్నాయా.. లేదా తెలుస్తుంది’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revamth Reddy) చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) కౌంటర్ ఇచ్చారు. ‘‘చీర నువ్వు కట్టుకుంటావా.. రాహుల్‌గాంధీకి కట్టిస్తావా ’’.. అని ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన ట్విటర్(ఎక్స్) ద్వారా స్పందించారు. నెలకు 2,500 ఎక్కడ ఇస్తున్నారు.. చూపిస్తావా, ఇన్ని పచ్చి అబద్దాలా.. అని ప్రశ్నించారు. ‘‘తెలంగాణలో ఉన్న కోటీ 67 లక్షల మంది 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు అడుగుతున్నారు.. నెలకు 2,500 ఏవీ.. అని. తెలంగాణలో కాంగ్రెస్ ను బొంద పెట్టేది ఆడబిడ్డలే. డైలాగులేమో ఇందిరమ్మ రాజ్యం, చేసేది సోనియమ్మ జపం, కానీ మహిళా సంక్షేమంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా వైఫల్యం.. కేసీఆర్ కిట్ ఆగింది. న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది. కల్యాణలక్ష్మి నిలిచింది. తులం బంగారం అడ్రస్ లేదు. ఫ్రీ బస్సు అని బిల్డప్.. అందులో సీట్లు దొరకవు. ముష్టి యుద్ధాలు చేసే దుస్థితి. చిల్లర మాటలు ఉద్దెర పనులు తప్ప, నువ్వు, నీ ప్రభుత్వం చేసిందేమీ లేదు..’’ అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ చురకలు అంటించారు.
—————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
