* కాంగ్రెస్ తీరుపై కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ”కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లబ్దిదారుల నుంచి సొమ్ముని వెనక్కు రాబట్టే వింత చేష్టలు మొదలుపెట్టింది. ఏవో సాంకేతిక కారణాలు చూపిస్తూ వేలాది మంది ఆసరా పెన్షన్ లబ్దిదారుల నుండి డబ్బును ప్రభుత్వానికి వెనక్కు పంపమని నోటీసులు ఇస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల ముసలమ్మకు ఆసరా పెన్షన్ (Aasara pension) కింద వచ్చిన ఒక లక్షా 72 వేల రూపాయలు వెనక్కు కట్టాలని నోటీసు ఇచ్చారు. ఒంటరి మహిళగా పక్షవాతంతో బాధపడుతూ ఉన్న దాసరి మల్లమ్మ(Dasari Mallamma) వంటి వృద్ధుల నుంచి కేసీఆర్ సర్కారు (KTR Government) ఇచ్చిన ఆసరా పెన్షన్ సొమ్మును తిరిగి లాక్కోవడానికి ప్రయత్నించడం రేవంత్ సర్కార్ (Revanth Government) అమానవీయ వైఖరికి నిదర్శనం. వెంటనే పేదల మీద ఇటువంటి దుర్మార్గపు చర్యలు మానుకోవాలి!
లేకుంటే ప్రజలే కాంగ్రెస్ సర్కార్ మీద తిరగబడతారు!” అంటూ మాజీమంత్రి కేటీఆర్ (Former Minister KTR) ఎక్స్ వేదికగా కాంగ్రెస్ సర్కారు (Congress Government) ను హెచ్చరించారు.
———————–