ఆకేరున్యూస్ డెస్క్: ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నర్సయ్య నిరాడంబర జీవనం గడుపుతాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో కంటి పరీక్షల కోసం ఆయన వచ్చారు. అక్కడ అందరితో పాటే ఓపీ చీటీ తీసుకుని వైద్యుల గది ముందు క్యూలో వేచి ఉండి తన వంతు వచ్చాక పరీక్ష చేయించుకున్నారు. 25 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగిన గుమ్మడి నర్సయ్య అందుకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని పలువురు అభినందిస్తున్నారు.
…………………………………………