* వెల్లడించిన నిమ్స్ వైద్యులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం (Manda Jagannadham) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని నిమ్స్ వైద్యులు ప్రకటించారు. రెండు రోజుల క్రితం ఆయనకు గుండెపోటు వచ్చింది. కుటుంబసభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్(Congress) టికెట్ ఆశించి ఆ పార్టీలో చేరారు. అయితే నాగర్‌కర్నూల్ టికెట్ దక్కకపోవడంతో బీఎస్పీ(Bsp)లో చేరారు.
………………………………….