
* కేసీఆర్, కేటీఆర్ సంతాపం
ఆకేరు న్యూస్, వైరా : ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బాణోత్ మదన్‌లాల్ (Banoth Madanlal) కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయన హైదరాబాద్ ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈక్రమంలో మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. గతవారం ఖమ్మంలోని ఆయన నివాసంలో వాంతులు, విరేచనాలు కావడంతో కుటుంబ సభ్యులు స్థానిక దవాఖానలో చేర్పించారు. అయితే మెరుగైన వైద్యం కోసం ఏఐజీ హాస్పిటల్‌కు తరలించగా పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున వైరా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018, 2023 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. దీంతో వైరా బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. ఆయన సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. మదన్ లాల్ మృతిపై బీఆర్ ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR), బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) సుదీర్ఘ కాలం ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించారని అన్నారు. మంత్రులు పొంగులేటి, తుమ్మల కూడా మదన్ లాల్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
…………………………………………….