* కేటీఆర్‌పై కేసు.. స్పందించిన సీఎం రేవంత్
* ఫార్ములా -ఈపై చర్చను బీఏసీలో ఎందుకు అడగలేదని ప్రశ్న
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఫార్ములా – ఈపై చర్చకు ఎప్పుడైనా సిద్ధమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CHIEF MINISTER REVANTHREDDY)తెలిపారు. కేటీఆర్(KTR)పై కేసుకు సంబంధించి అసెంబ్లీలో రేవంత్ స్పందించారు. మూడు నెలల నుంచే దీనిపై చర్చ జరుగుతోందని, ఫార్ములా ఈ(FORMULA -E)పై చర్చకు ఎప్పుడైనా రెడీ అన్నారు. అవసరమైతే బీఆర్ ఎస్(BRS) కార్యాలయానికి వెళ్లడానికి రెడీ అన్నారు. తప్పు చేసి కూడా బీఆర్ ఎస్ నేతలు దబాయిస్తున్నారని ఆరోపించారు. 55 కోట్లు పోతే ఏమవుతుందని అంటున్నారని, 55 కోట్లు అంటే చిన్న మొత్తమా అని ప్రశ్నించారు. నన్ను కలిసిన వాళ్లు నాతో ఫొటో దిగుతుంటారని, అలాగే ఎఫ్ఈఓ (FEO)ప్రతినిధులు నాతో ఫొటోలు దిగారని వివరించారు. మేం ప్రమాణస్వీకారం చేసినప్పుడే వాళ్లు మమ్మల్ని కలిశారని, మీరు కూడా సహకరించాలని కోరినట్లు వెల్లడించారు. కేటీఆర్‌తో చీకటి ఒప్పందం ఉందని వాళ్లే మాతో చెప్పారని వివరించారు. ఫార్ములా -ఈపై చర్చకు బీఏసీ(BAC)లో ఎందుకు అడగలేదని విపక్షాన్ని రేవంత్ ప్రశ్నించారు.
………………………………………..