
* భారీగా నమోదైన డ్రంకెన్ డ్రైవ్ కేసులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : డిసెంబర్ 31నైట్ నగరవాసులు వేడుక చేసుకున్నారు. హ్యాపీ న్యూయర్ (Happy New Year)అంటూ సందడి చేశారు. పబ్బులు, క్లబ్బుల్లో ఆడి పాడారు. ఎక్కడ చూసినా సందడే సందడి. యువత బైక్‌లతో రోడ్లపై షికార్లు చేశారు. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లోనూ న్యూ ఇయర్ పార్టీలు చేసుకున్నారు. ఇదిలాఉండగా, పోలీసులు మందుబాబులకు చుక్కలు చూపించారు. మద్యం తాగి వాహనాలను నడిపేవారికి అడ్డుకట్ట వేసేందుకు ఎక్కడికక్కడ డ్రంకెన్ డ్రైవ్ (Druken Drive)టెస్టులు నిర్వహించారు. దీంతో నగరంలో మంగళవారం రాత్రి భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి. సుమారు 1800 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,184, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 619 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
……………………………….