
ఆకేరు న్యూస్ , హనుమకొండ : బల్దియా పరిధిలోని 53. 54వ డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి , బల్దియా కమిషనర్ అశ్విని వాకడే తో కలిసి శంకుస్థాపన చేశారు. 53వ డివిజన్ లోని మహాత్మానగర్లో 30 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్లు డ్రైన్ పనులు చేపట్టనున్నారు. 54వ డివిజన్ పరిధిలోని సగరకాలనీ 33 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే 53 వ డివిజన్ లో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక ప్రజలు, అధికారులు, కార్పొరేటర్లతో ఎమ్మెల్యే, కమిషనర్ లు స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు గుంటి రజిత శ్రీనివాస్ సోదా కిరణ్ సి ఏం హెచ్ ఓ డా.రాజారెడ్డి అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
………………………………………………….