
* హాజరైన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, మేయర్ గుండు సుధారాణి
ఆకేరు న్యూస్ హనుమకొండః వరంగల్ నగర పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు, నగర మేయర్ గుండు సుధారాణిలు ఈ కార్యక్రంలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.వరంగల్ నగర పరిధి లోని 22 వ డివిజన్ పరిధి పోచమ్మైదాన్ వద్ద ఎంపీ లాడ్స్ నిధులు రూ.50 లక్షల అంచనా వ్యయం తో చేపట్టనున్న ఎస్ సి కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు,12 వ డివిజన్ లోని తుమ్మలకుంటలో బల్దియా సాధారణ నిధులు రూ. 45.00 లక్షల అంచనా వ్యయం తో చేపట్టనున్న కమ్యూనిటీ హాల్ బ్యాలెన్స్ పనులను చేపట్టడానికి దేశాయిపేటలో బల్దియా సాధారణ నిధులు రు.30 లక్షల అంచనా వ్యయం తో చేపట్టనున్న పెరుక సంఘం కమ్యూనిటీ హాల్ బ్యాలెన్స్ పనులతో పాటు 42 వ డివిజన్ లెనిన్ నగర్ రంగశాయి పేట ప్రాంతం లో బల్దియా సాధారణ నిధులు రూ.40 లక్షల అంచనా వ్యయం తో చేపట్టనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు, 38 వ డివిజన్ శాంతి నగర్ లో బల్దియా సాధారణ నిధులు రూ.17.50 లక్షల అంచనా వ్యయం తో చేపట్టనున్న సి సి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బసవరాజు కుమారస్వామి కావేటి కవిత సురేష్ జోషి తదితరులు పాల్గొన్నారు.
…………………………………….