
ఆకేరు న్యూస్ డెస్క్ : ఇటీవల విమాన ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అహమ్మదాబాద్ లో జరిగిన ఘోర విమానప్రమాదంలో 242 మంది మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఎక్కడో ఒకచోటు సాంకేతిక కారణాలతో విమానాలు హఠాత్తుగా ల్యాండ్ కావడం, ప్రమాదాలకు గురికావడంజరుగుతున్నది. తాజాగా అరిజోనాలో జరిగిన విమాన ప్రమాదంలో నలుగురు మరణించారు. ఉత్తర అరిజోనాలోని (Arizona) నేషన్ సమీపంలో మంగళవారం ఒక వైద్యరవాణా విమానం కుప్పకూలింది. 12:40 గంటల సమయంలో జరిగిన ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న నలుగురు వైద్యసిబ్బంది మరణించినట్లు అధికారులు తెలిపారు. న్యూ మెక్సికోలోని అల్బుకెర్కీ నుండి బయలుదేరిన డిఎస్ఐ ఏవియేషన్ కంపెనీకి చెందిన ఈవిమానం చిన్లే మున్సిపల్ ఎయిర్పోర్ట్ సమీపంలో ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
సహాయక చర్యలకు ఆటంకాలు
ప్రమాదం జరిగిన వెంటనే విమానంలో మంటలు చలరేగాయని అధికారులు చెప్పారు. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగినట్లు సమాచారం. మరణించిన ముగ్గురు వైద్యసిబ్బంది, ఒక పేషెంట్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆ పేషెంట్ ను చికిత్స కోసం తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని వెల్లడించారు. ఈ విషయంపై నవజో నేషన్ (Navajo Nation) అధ్యక్షుడు బుయు నైగ్రెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
…………………………………….