
* హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్లుగా నలుగురు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. బోరెడ్డి అయోధ్య రెడ్డి, పీవీ శ్రీనివాసరావు, మొహ్సినీ పర్వీన్, దేశాల భూపాల్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన సమాచార కమిషనర్ వీరితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (REVANTHREDDY) హాజరయ్యారు. వీరి నియామకానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలపడంతో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు (K.RAMAKRISHNA RAO) మే 12న ఉత్తర్వులు జారీ చేశారు. ఈరోజు వారు ప్రమాణ స్వీకారం చేశారు. వీరు మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు.
………………………………………