
* హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన
ఆకేరున్యూస్,హైదరాబాద్ ః గత నాలుగు రోజులుగా హైదరాబాద్లో వర్షాలు దంచికొడుతున్నాయి.జులై 24న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని దాని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ నాలుగు రోజుల క్రితం ప్రకటించింది. ఈ నేపధ్యంలో గత నాలుగు రోజులు గా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం సంతోష్ నగర్, హిమాయత్ నగర్, నల్లకుంట,చాదర్ఘాట్, సైదాబాద్, సంతోష్ నగర్, హిమాయత్ నగర్,తార్నాక, ఉప్పల్, హబ్సిగూడ, మలక్ పేట, చాదర్ఘాట్, సైదాబాద్, సంతోష్ నగర్,అంబర్పేట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపధ్యంలో వాతావరణ శాఖ తెలంగాణ లోని పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ పదిహేను జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. వర్షాలు ఎదతెరిపి లేకుండా కురుస్తున్నందున హైదరాబాద్ జీహెచ్ ఎంసీ అధికారులు నగర పౌరులకు ఇబ్బంది కలుగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు మందుగానే హెచ్చరికలు జారీ చేశారు. ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో సహాయకచర్యలకు మందుస్తుగానే ఏర్పాట్లు చేసుకున్నారు. భారీగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమై ట్రాఫిక్ రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది.
…………………………………….