
* మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో …
ఆకేరు న్యూస్ డెస్క్ : బయట ఫుడ్ కు అలవాటు పడి ఫుడ్ కు ఆర్డర్ ఇచ్చి తెప్పించుకంటున్నారా.. అయితే జాగ్రత్తగా ఉండండి మీరు తినే ఫుడ్ లో ఏమైనా రావచ్చు.. అది చర్చిన పాము పిల్ల అయినా కావచ్చు.. ఫుడ్లో చచ్చిన పాము పిల్ల ఏంటిరా అని ఆశ్చర్య పోకండి… కర్రీ పఫ్ కు ఆర్డర్ ఇస్తే పఫతో పాటు ఓ పాముపిల్లను కూడా ప్యాక్ చేసి పంపారు. సోషల్ మీడియా పుణ్యమా అని అది కాస్త వైరల్ అయి అందరికీ తెలిసింది. వివరాల్లోకి వెళితే మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లో శ్రీశైలమ్మ అనే మహిళా సరదాగా కర్రీ పఫ్ తిందామనుకుంది. పట్టణంలో ఉన్న అయ్యంగార్ బేకరీలో కర్రీపఫ్ పార్సిల్ చేసుకొని తిందామనుకొని పార్సిల్ విప్పే సరికి అందులో కర్రీ పఫ్ తో పాటు అందులో ఓ పాము పిల్ల కన్పించింది. దీంతో ఆశ్చర్యపోయిన ఆమె వెంటనే చుట్టుపక్కల వాళ్లకు ఈ విషయాన్ని తెలియజేసింది. అందరూ కలిసి బేకరీ యజమానిని నిలదీయడానికి వెళ్లగా అతను సమాధానం చెప్పలేక బెదిరిపోయి షాప్ మూసేసిపరారయ్యాడు. దీంతో సదరు మహిళ స్థానికి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కర్రీపఫ్ కు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
…………………………………