అన్నమయ్య జిల్లాలోని మైసూర వారి పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతున్న ఏపీ డిప్యూటీ సీయం పవన్ కళ్యాణ్
* పునరావాస కేంద్రాలకు రవాణా
* ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ వెల్లడి
ఆకేరు న్యూస్ డెస్క్ : మొంథా తుఫాన్ నేపధ్యంలో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా కూటమి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా తెలిపారు. పునరావాస కేంద్రాల్లో బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యంతో పాటు ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.కందిపప్పు కేజీ, పామాయిల్ ఒక లీటర్, ఉల్లిపాయలు కేజీ, బంగాళాదుంపలు కేజీ, పంచదార కేజీ చొప్పున అందిస్తారన్నారు. ఈ మేరకు పౌర సరఫరా మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలు జారీ చేసినట్లు పవన్ పేర్కొన్నారు. మొత్తం 14,415 రేషన్ షాపుల్లో 1 లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం, 3424 మెట్రిక్ టన్నుల పంచదారతో పాటు ఇతర నిత్యావసరాలను పంపిణీకి సిద్ధంగా ఉంచారని పవన్ ట్వీట్ చేశారు.
…………………………………………..
