
ఆకేరు న్యూస్, తాడ్వాయి: తాడ్వాయి మండలం దామెరవాయి గ్రామంలో శనివారం ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారిని పరీక్షించి ఉచిత మందులు చేశారు ఈ సందర్భంగా ఆ గ్రామస్తులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పలువురు వైద్యాధికారులు మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నివారణ తీసుకోవలసిన జాగ్రత్తలు పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత శుభ్రత తాగునీరు తదితర అంశాలతో పాటు వ్యక్తిగత శుభ్రత వ్యాధుల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు ఈ ఉచిత వైద్య శిబిరంలో దామెరవాయి గ్రామ ప్రజలతో పాటు చుట్టు పక్కల గ్రామ ప్రజలు దాదాపు 300 మంది ప్రజలు వైద్య సేవలు పొందారు. కార్యక్రమంలో డాక్టర్.నరేష్ కుమార్, డాక్టర్. రాజీవ్, డా. శ్రీనాథ్, డా. ఇస్సాక్, డా. ప్రవీణ్, డా. వెంకటేష్ , డా. నవదీప్, డా. లోకేష్, డా. హర్షవర్ధన్ , కేఎంసీ ఎంబిబిఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరానికిఅన్ని విధాలుగా సహకారాన్ని అందించిన కొత్తూరి రోహిత్, కార్తీక్ లను వైద్య అధికారులు, గ్రామ ప్రజలు అభినందిచారు.
…………………………………………….