ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కొత్త సంవత్సరం సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడపలేని వారికి ఉచిత రవాణా సదుపాయం కల్పించారు. టీజీడబ్ల్యూయూ (తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్) ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఈ సదుపాయం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంటలకు ఈ ఉచిత సేవ అందుబాటులో ఉండనుంది. క్యాబ్‌లు, ఆటోలు, ఈ బైకులు సహా 500 వాహనాలను అందుబాటులో ఉంచారు. ఈ ఉచిత సేవ కావాలిసిన వారు 8977009804 నంబర్‌కు కాల్ చేసి ఈ ఉచిత రైడ్ సేవలను పొందవచ్చని ప్రకటించారు. ఈ సంవత్సరం, బిజ్లిరైడ్తో కలిసి ఈ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా… మద్యం మత్తులో వాహనాలు నడిపితే… వాహనదారులతో పాటు సామాన్యులు కూడా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. దీన్ని నివారించి… రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో #HumAapkeSaathHai ప్రచారాన్ని ప్రారంభించామని టీజీపీడబ్ల్యుయూ అధ్యక్షులు షేక్ సలాహుద్దీన్ తెలిపారు.
……………………………………….

