* కఫాల వ్యవస్థను రద్దు చేసిన సౌదీ ప్రభుత్వం
* వలసవాదులకు ఊరట
*విజన్ 2030 దిశగా సౌదీ అడుగులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సౌదీ అరేభియా ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మకమైన మార్పుతో సౌదీలో దేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న విదేశీయులకు గొప్ప ఊరట లభించింది. ఆధినిక సౌదీ నిర్మాణమే లక్ష్యంగా ప్రపంచదేశాలతో పోటీ పడుతూ పటిష్టమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించాలనే పట్టుదలతో సౌదీ ప్రభుత్వం ఉంది. సౌదీ యువరాజు,ప్రధానమంత్రి మహ్మద్ బిన్ సల్మాన్ విజన్ 2030 దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగానే దేశంలో దశాబ్దకాలంగా అమలులో ఉన్న కఫాల వ్యవస్థను రద్దు చేస్తూ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు.
ఏంటీ కఫాల..?
సౌదీ భాషలో కఫీ అంటే యజమాని లేదా స్పాన్సర్ అని అర్థం..కఫాల అంటే స్పాన్సర్ షిప్ అని అర్థం. కఫాలా వ్యవస్థ సౌదీ దేశాల్లో 1950 దశకంలో ప్రారంభంచ బడింది.గల్ప్ దేశాల్లో చమురును కనుగొన్న సమయంలో తక్కవ జీతాలకు పనిచేసే కార్మికుల అవసరం అయింది. ఈ నేపధ్యంలో వివిధ దేశాలకు చెందిన కార్మికులు లేదా ఇతర రంగాల్లో పనిచేసే వారు సౌదీ దేశాలకు వలస పోయారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వలస కార్మికుల కోసం సౌదీ దేశాలు కఫాలా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. కఫాలా వ్యవస్థ అంటే ఒకరకంగా ఆధునిక బానిసత్వమనే చెప్పాలి. కఫాలా చట్టం ప్రకారం ఆ దేశాల్లో వలసకార్మికులుగా వెళ్లిన వారికి ఎలాంటి స్వేచ్ఛ ఉండదు.యజమాని దయా దక్షిణ్యాల మీద ఆధార పడి బతకాలి . ఆ దేశాల చట్టాలను అనుభవించే అధికారం ఉండదు. ఆ దేశం చేరుకోగానే పాస్ పోర్టును యజమాని స్వాధీనం చేసుకుంటారు. వేరే ఉద్యోగం చేసుకోవాలన్నా స్వంత దేశం తిరిగి పోవాలన్నా యజమాని ఇష్టా ఇష్టాలపైనే ఆధారపడి ఉంటుంది. దీంతో వలస వెళ్లిన వారందరూ కట్టు బానిసలుగా
బతికే పరిస్థితి ఉంటుంది.
40 శాతం వలసదారులే
సౌదీ అరేబియాలో దాదాపు 1.34 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారు. నిర్మాణ రంగ కా ర్మికులు,పనిమనుషులు,పారిశుధ్య కార్మికులు, డ్రైవర్లు,క్టీనర్లు తదితర పనులు చేస్తూ జీవిస్తున్నారు. భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్,శ్రీలంక,ఫిలిప్పీన్స్,నేపాల్,ఇథియోఫియా దేశాలనుంచి ఎక్కువగా
సౌదీకి వలస వెళ్లారు.కఫాలా వ్యవస్థను సౌదీ పూర్తిగా రద్దు చేసినప్పటికీ యూఏఈ,కువైట్,బహ్రెయిన్, ఒమన్ వంటి దేశాల్లో ఇంకా అమలు లో ఉంది. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక సౌదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా దేశంలో ఆధునిక సంస్కరణలు తీసుకువచ్చి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి సౌదీ యువ రాజు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు.
దీని వల్ల ప్రయోజనాలు ఏంటి..?
కఫాల రద్దుతో సౌదీ అరేబియాలో నివసిస్తున్న వలదారులకు చాలా ఊరట లభిస్తుంది. అమెరికా , యూరప్ దేశాల్లో వలస వెళ్లిన వారు అక్కడ స్వేచ్ఛగా బతి కే అవకాశం ఉంటుంది. చేస్తున్న ఉద్యోగం ఇష్టం లేకుంటే వేరే ఉద్యోగం వెతుక్కునే అవకాశం ఉంటుంది. ఒక ఉద్యోగం చేసుకుంటూ ఆదాయం సరిపోక పోతే ఇంకో ఉద్యోగం చేసుకునే అవకాశం లభిస్తుంది. దీంతో వలస వెళ్లిన వారికి ఆర్థికంగా బలం చేకూరడమే కాకుండా స్వేచ్ఛగా పని చేసుకునే అవకాశం లభిస్తుంది.
………………………………………………….
