
* కండువా కప్పి ఆహ్వానించిన హరీష్రావు
ఆకేరున్యూస్, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీజేపీ సీనియర్ మహిళా నాయకులు కళావతి, బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు బి. లక్ష్మి, రాష్ట్ర మహిళా మోర్చా నాయకులు శైలజ, ఆర్కే లక్ష్మీ ,అనురాధ, మంజుల, సత్యవతితో పాటు 200 వందల మంది పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. సిద్దిపేట ఎంఎల్ ఏ హరీష్రావు పార్టీ కండువాలు కప్పి ఆహ్వనించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ బీఆర్ ఎస్ లో చేరుతున్న వారిని అభినందించారు. మాగంటి కుటుంబం మీద ఉన్న అభిమానంతో పార్టీలో చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ నాయకులు ఓటు చోరీకి పాల్పడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. భర్తను కోల్పోయిన సునీతను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల మందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చ లేదని అన్నారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొడుతున్నారని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పక్క కాంగ్రెస్ పార్టీ మరో పక్క బీజేపీలు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని హరీష్ ఆరోపించారు. తెలంగాణ ను అభివృద్ధి చేయడం ఒక్క కేసీఆర్ కే సాధ్యమవుతుందన్నారు.
………………………………………………