
* ఏటూరునాగారం లో అగ్నిమాపక భవన నిర్మాణానికి రూ. 2 కోట్లు
* మేడారంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నిర్మాణానికి రూ.5 కోట్లు
* నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్తులు జారీ చేసింది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పరిసరాలలో ఆర్&బీ గెస్ట్ హౌస్ భవనానికి రూ. ఐదు కోట్లు, ఏటూరునాగారంలో అగ్నిమాపక కేంద్రం భవనానికి రూ.2 కోట్లు మంజూరు చేసింది. ఏజెన్సీ ప్రాంతంలో పలు రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్న పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనుసరి అనసూయ సీతక్కకు ఈ ప్రాంత ప్రజలు, కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. తాడ్వాయి మండలం అభివృద్ధికి అహర్నిశలు తోడ్పాటు అందిస్తున్న మంత్రి సీతక్కకు కాంగ్రెస్ పార్టీ తాడ్వాయి మండలం కమిటీ అధ్యక్షుడు బొల్లు దేవేందర్ ముదిరాజ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు .
…………………………….