
* ఉర్దూ చిత్రాలకూ ప్రభుత్వ ప్రోత్సాహం : భట్టి
* జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం : దిల్ రాజు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎలాంటి రాగద్వేషాలు లేకుండా గద్దర్ అవార్డుల ఎంపిక ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (BATTI VIKRAMARKA) తెలిపారు. చిత్ర పరిశ్రమకు గొప్ప పేరు తెచ్చిన వ్యక్తుల పేరు మీద కూడా అవార్డులు ఇస్తామని అన్నారు. హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో భట్టి మాట్లాడుతూ హెచ్ ఐసీసీ వేదికగా గద్దర్ అవార్డుల ప్రదానం ఉంటుందని వెల్లడించారు. ఈ ప్రభుత్వం చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తుందని హామీ ఇచ్చారు. తెలుగు చిత్రాలను మాత్రమే కాకుండా, ఉర్దూ చిత్రాలను కూడా ప్రోత్సహిస్తామని వివరించారు. తెలంగాణ గుండె చప్పుడును తన పాటల ద్వారా విశ్వవ్యాప్తం చేసిన గొప్ప వ్యక్తి గద్దర్ అన్నారు. పిల్లవాడి దగ్గర నుంచి పెద్దల వరకు గద్దర బాణి, పాటలను అనుకరిస్తారని వివరించారు. గద్దర్ తన పాటతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారని గుర్తు చేశారు. గద్దర్ పేరు మీద అవార్డులు ప్రదానం చేయడం హర్షణీయమని భట్టి తెలిపారు. జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల (GADDAR TELANGANA FILM AWARDS) ప్రదానోత్సవం ఉంటుందని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు (DIL RAJU) వెల్లడించారు. కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జయసుధ, జీవిత తదితరులు పాల్గొన్నారు.
……………………………………………….