
* త్వరలో పెండింగ్ స్కాలర్ షిప్ ల బకాయిలను విడుదల చేస్తాం
* అసెంబ్లీలో మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కేంద్రం డైట్ చార్జీలు, స్కాలర్ షిప్ ల నిలిపివేతతో రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతోందని మంత్రి సీతక్క (Seethakka) తెలిపారు. విదేశీ విద్యా పథకాన్ని రాజకీయం చేయాలి అనేది గంగుల తపన అని విమర్శించారు. విదేశీ విద్యా పథకం కింద 1913 మంది చదువుతున్నట్లు అసెంబ్లీలో వివరించారు. కాంగ్రెస్(Congress) వచ్చాక 210 మంది ఎస్సీలను, 300 మంది బీసీలను, 100 మంది ఎస్టీలను, 500 మంది మైనారిటీలను ఈ పథకం కింద చదువుకోవడానికి ఎంపిక చేసిందన్నారు. ఈ పథకం నిమిత్తం నిమిత్తం గత బకాయిలతో కలిపి 167 కోట్లు చెల్లించామని సీతక్క వివరించారు. కాంగ్రెస్ వచ్చే నాటికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ బకాయిలు 4,332 కోట్లు ఉన్నాయని తెలిపారు. పెండింగ్ స్కాలర్ షిప్ బకాయిలను త్వరలో విడుదల చేస్తామన్నారు. హాస్టళ్లలో పిల్లలకు హాని కలిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విదేశీ విద్యా పథకం కింద చదువుతున్న విద్యార్థులకు త్వరలో ఫలాలు అందుతాయని అన్నారు. గత ప్రభుత్వంలో పెండింగ్ పెట్టిన బకాయిలను కూడా చెల్లిస్తూ వస్తున్నామని వివరించారు.
ప్రస్తుతం ఇస్తోంది గుండు సున్నా
అంతకు ముందు అసెంబ్లీలో మాజీ మంత్రి గంగుల (Gangula) మాట్లాడుతూ.. విదేశీ విద్యా పథకం కింద ఎంపికైన విద్యార్థులు 1913 అన్నారని, గతంలో కేవలం బీసీల్లోనే 2,230 మందిని ఎంపిక చేశారని అన్నారు. ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థుల సంఖ్య ఎంతో స్పష్టంగా చెప్పాలన్నారు.2016లో కేసీఆర్ హయాంలోనే విదేశీ విద్యా పథకం అమలు చేసినట్లు చెప్పారు. గతంలో ఏటా 300 మంది విద్యార్థులను ఈ పథకం కింద ఎంపిక చేసేవారన్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద బీసీలకు, ఎస్సీలకు, మైనారిటీలకు ఇచ్చింది గుండు సున్నా అన్నారు.
……………………………………