Gareeb Nagar Murder
* Gareeb Nagar లో దారుణం..
ఆకేరు న్యూస్, వరంగల్ : 16వ డివిజన్ పరిధిలోని గరీబ్ నగర్లో (Gareeb Nagar Murder) దారుణ ఘటన చోటుచేసుకుంది. అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ చివరకు హత్యకు దారితీసింది. తమ్ముడు ప్రవీణ్‌ను అన్న ప్రసాద్ కత్తితో పొడిచి చంపినట్లు సమాచారం.
స్థానికుల వివరాల ప్రకారం.. నిన్న రాత్రి అన్న, తమ్ముళ్ల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ప్రసాద్ తన తమ్ముడు ప్రవీణ్‌పై కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన ప్రవీణ్ మృతి చెందినట్లు సమాచారం.
కుటుంబ కలహాలే ఘటనకు కారణమై ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
