ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా ఘంటా చక్రపాణిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో చక్రపాణి మూడేండ్ల పాటు కొనసాగనుండగా.. గతంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సోషియాలజీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా చక్రపాణి విధులు నిర్వర్తించారు. అలాగే తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఎస్పీఎస్సీ తొలి చైర్మన్గా ఘంటా చక్రపాణి సేవలందించారు.
………………………………..