
* వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య
* రెండు రోజుల క్రితమే పోలీసు అదుపులో..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో అడ్మిన్ విభాగంలో జాయింట్ కమిషనర్(JOINT COMMISSIONER)గా విధుల్లో ఉన్న జానకిరామ్‌ను గృహ హింస, భార్యను వేధింపుల కోసులో పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితమే పోలీసులను ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అప్పటి నుంచీ ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేశారు. తాజాగా ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. చంచల్‌గూడ జైలు(CHANCHALGUDA JAIL)కు తరలించారు. జానకిరామ్ గత కొంతకాలంగా విధి నిర్వహణ పేరుతో సరిగా ఇంటికి వెళ్లడం లేదు. దాంతోపాటు ఫోన్లు సైతం ఎక్కువగా మాట్లాడుతుండడంతో భార్య కల్యాణికి అనుమానం వచ్చింది. దీంతో భర్త పై నిఘా పెట్టిన కళ్యాణి.. వారసిగూడలో ఒక అపార్ట్మెంట్లో తనకన్నా 20 ఏళ్ల వయసు తక్కువగా ఉన్న మహిళ తో జానకిరామ్ కలిసి ఉన్నట్లు గుర్తించింది. గత శుక్రవారం ఉదయం ఆ అపార్ట్‌మెంట్‌కు బంధువులతో కలిసి వెళ్లిన కల్యాణి ఆ ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. జానకిరామ్ ఎక్కడ పనిచేసిన అక్కడ ఆఫీసులో ఉన్న అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారని ఆరోపించారు.
……………………………………………..