
– సెప్టెంబర్ లోపు అందుబాటులోకి
– పర్యవేక్షించిన బిజెపి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
ఆకేరు న్యూస్, కమలాపూర్ : కేంద్రమంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చొరవతో సోమవారం ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల్లో కీలక నిర్మాణం అయిన గడ్డర్ల బిగింపు పూర్తయింది. కరీంనగర్ జిల్లా బిజెపి అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి,స్థానిక బిజెపి శ్రేణులతో కలిసి ఆర్వోబి పనులను పర్యవేక్షించి,మీడియాతో మాట్లాడారు. ప్రయాణికుల చిరకాల వాంఛ అయిన ఆర్ఓబి నిర్మాణంలో కీలకమైన ముందడుగు పడిందని అన్నారు.గడ్డర్ల బిగింపు కోసం ఉదయం 6-9 గంటల వరకు రైల్వే శాఖ లైన్ క్లియరెన్స్ ఇవ్వడంతో నిర్ణీత వ్యవధిలోనే ఎలాంటి అవాంతరం లేకుండా పని పూర్తయిందని అన్నారు. సెప్టెంబర్ లోపు ఒక వైపు ఉన్నటువంటి ఆర్వో బి నిర్మాణం పూర్తయి వాహనాల ప్రయాణానికి అందుబాటులోకి రానుందని తెలిపారు. ఆర్ఓబి వంతెన నిర్మాణంలో మిగిలిన బౌస్ట్రింగ్ అమరిక, కాంక్రీట్ వర్క్, క్యూరింగ్ పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి రావడానికి త్వరితగతిన మిగిలిన పనులన్నీ పూర్తి చేయనున్నట్లు కాంట్రాక్టర్ సుబ్బారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో రైల్వే ఏడీఈ గుప్త, ఇంజనీర్లు, బీజెపి జిల్లా నాయకులు ఆకుల రాజేందర్,మండల అద్యక్షుడు ర్యాకం శ్రీనివాస్, అశోక్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి భూపతి ప్రవీణ్, జిల్లా అధికార ప్రతినిధి తుమ్మ శోభన్ బాబు, భోగి భిక్షపతి, రావుల ఆకాష్, చిట్టి సుందరయ్య ర్యాకం సుధాకర్, ఐకెపి రవి, మొగిలి, వంశీ రాజు తదితరులు పాల్గొన్నారు.
……………………………………………