– పొదుపు పాటించాలని అధికారుల సూచన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మహా నగరవాసులకు వాటర్‌బోర్డు అలర్ట్ మెసేజ్ పంపింది. ఈ నెల 9న ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 11 గంటల వరకు నగరానికి గోదావరి జలాల సరఫరాలో అంతరాయం తలెత్తనుందని పేర్కొంది. పైపులైన్ల మరమ్మతు పనుల కోసం సరఫరా ఆపాల్సి వస్తోందని, ముందు నుంచే పొదుపు పాటించి ఆయా రోజుల్లో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తోంది. మాదాపూర్, గచ్చిబౌలి, నల్లగండ్ల, హఫీజ్‌పేట్, మియాపూర్ సెక్షన్లు, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, తూముకుంట, జవహర్‌నగర్, దమ్మాయిగూడ, నాగారం సెక్షన్, అయ్యప్పకాలనీ ప్రాంతాలు, నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్, గండిమైసమ్మ, తెల్లాపూర్, బోల్లారం, బౌరాంపేట్ సెక్షన్లు, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఏఐఐఎంఎస్బీ నగర్, ఎస్ఆర్నగర్, సనత్‌నగర్, బోరబండ, ఎస్పీఆర్ హిల్స్, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, వెంకట్రావు నగర్, ఎల్లారెడ్డిగూడ, సోమాజిగూడ, ఫతేనగర్ సెక్షన్లు, కూకట్పల్లి, భాగ్యనగర్, వివేకానందనగర్, ఎల్లమ్మబండ, మూసాపేట్, భరత్‌నగర్, మోతీనగర్, గాయత్రీనగర్, బాబానగర్, కేపీహెచ్‌బీ, బాలాజీనగర్, గాజుల రామారం, సూరారం, ఆదర్శనగర్, భగత్‌సింగ్‌నగర్, జగద్గిరిగుట్ట, ఉషోదయ సెక్షన్, అల్వాల్, వెంకటాపురం, మచ్చ బొల్లారం, డిఫెన్స్ కాలనీ, వాజ్‌పేయి నగర్, యాప్రాల్, చాణక్యపురి, గౌతమ్‌నగర్, సాయినాథ్‌పురం సెక్షన్, మౌలాలి రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్ కానుంది.
………………………………………………
