
* ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
ఆకేరున్యూస్, జనగామ: ప్రతి గ్రామానికి గోదావరి నీళ్లు అందిస్తానని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. జనగామ రూరల్ మండలంలోని పెంబర్లి, పెద్దపాడు, గానుగు పహాడ్, వెంకిర్యాల, అడవి కేశవాపూర్, ఎర్రగొల్ల పహాడ్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ యాసంగికి బొమ్మకూరు నుంచి కుడి కాలువ ద్వారా నీళ్లు అందిచడం లేదనీ పెంబర్తి రైతులు తన దృష్టికి తీసుకవచ్చారన్నారు. దేవాదుల మూడో దశ మోటార్లు మొదలయ్యాయని, తద్వారా రెండు పంటలకు నీరు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ నీరు రానట్లయితే అధికారులతో తాను మాట్లాడుతానని పేర్కొన్నారు. రైతులకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రతి రైతు నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు.
……………………………….