
* ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ప్రముఖులు
ఆకేరు న్యూస్, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లో మరో అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. ఆలయంలో దివ్యవిమాన స్వర్ణ గోపుర (Divya Vimana Golden Gopuram) మహాకుంభాభిషేకం జరిగింది. దేశంలో ప్రసిద్ధి చెందిన గంగా, యమునా, గోదావరి, కృష్ణా, తుంగభద్ర, నర్మదా నదీ జలాలతో స్వర్ణ విమాన గోపురానికి మహాసంప్రోక్షణ చేశారు. స్వర్ణమయంగా మారిన దివ్యవిమాన గోపురం, బంగారు గోపురాన్ని సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanthreddy) ఆవిష్కరించారు. ఉదయం 11.54 గంటలకు స్వర్ణగోపురాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించగా, ఈ మహా క్రతువులో ఎంపీ చామల కిరణ్కుమార్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి పాల్గొన్నారు. భక్తులకు దర్శనమిచ్చిన స్వర్ణగోపురం. భక్తులు, దాతలు సమర్పించిన విరాళాలతో దేశంలో ఎక్కడా లేని విధంగా 68 కిలోల బంగారంతో గోపురాన్ని స్వర్ణమయంగా మార్చారు. స్వర్ణతాపడం కోసం రూ.80 కోట్లకు పైగా ఆలయ అధికారులు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. మహాక్రతువును తిలకించేందుకు భారీగా భక్తజనం తరలివచ్చారు. సీఎం రావడంతో జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.
………………………………………