
* యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ సుందర రాజ్ యాదవ్
ఆకేరున్యూస్, హనుమకొండ : ఆలోచించాలి.. ఆవిష్కరించాలి.. ఆచరించాలి అనే మౌలిక సూత్రాల ఆధారంగా యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ పురుడు పోసుకుందని యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ సుందర రాజ్ యాదవ్ అన్నారు. బుధవారం రాంనగర్ లోని బీసీజ భవన్ లో ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సందర రాజ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొల్ల కురుమల అభివృద్ధి కోసం ట్రస్ట్ చేస్లున్న కృషిని వివరించారు. ఆధునిక మార్పులను అవగాహన చేసుకుంటూ ముందుకు సాగాలని కోరారు. దొడ్డి కొమురయ్య ఆశయంతో మల్లన్న, బీరన్న వారసులుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలన్నారు.వందే జగద్గురు మార్గాన్ని సిద్ధాంతంగా మలిచి ప్రస్తుతం మన భుజాన వేసుకున్న మన గొంగడితో బాధ్యతగా సాగే సంకల్పమే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల ను ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అలాడే ఆగస్టు 16 న ట్రస్్ట ఆధ్వర్యంలో నగరంలోని కాళోజీ కళాక్షేత్రంలో పెద్ద ఎత్తున కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు మంత్రి కొండా సురేఖ,ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి,నాగరాజ్ లు పాల్గొంటారని వివరించారు. ఈ సందర్భంగా రాంనగర్ నుంచి కాళోజీ కళాక్షేత్రం వరకు ఆటపాటలు సాంస్కృతిక కార్యక్రమాలతో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు
……………………………………..