ఆకేరున్యూస్ డెస్క్ : తెలంగాణలో మైక్రో బ్రూవరీలు రాబోతున్నాయి ,.ఈ మేరకు ఎక్సైజ్ శాఖ అనుమతులు ఇచ్చింది. ఇక నుండి హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, పర్యాటక ప్రదేశాల్లో కూడా బీర్లు లభించనున్నాయి. 1000 చదరపు అడుగుల స్థలం ఉండి ఒక లక్ష డిపాజిట్ చేస్తే చాలు అనుమతి ఇస్తారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(TCUR)తో పాటు కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మైక్రో బ్రూవరీలకు ఎక్సై.జ్ శాఖ అనుమతినిచ్చింది. TCUR పరిధిలోని జీహెచ్ఎంసీ, బోడుప్పల్, జవహర్ నగర్, పీర్జాదిగూడ, బడంగ్ పేట్, బండ్లగూడ జాగీర్, నిజాంపేట్, మీర్ పేట్ పరిధిలో కూడా దరఖాస్తుల స్వీకరిస్తారు.
………………………………………
