
* మరో వారం రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ
* తొలి విడతలో 72,045మందికి ఇళ్ల మంజూరు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల (Indiramma illu) పంపిణీకి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మరో వారం లబ్ధిదారులకు ఇళ్లను అందజేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)తెలిపారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి 3,500ఇళ్లను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. జనవరి 26న రాష్ట్రంలో మండలానికి ఒక గ్రామం చొప్పున మొత్తం 562 పంచాయితీల్లో పథకాన్ని ప్రారంభించి అధికారులు అర్హుల జాబితాను వెల్లడించారు. తొలి విడతలో 72,045మందికి ఇళ్లను మంజూరు చేశారు. ఇప్పుడు గతంలో జాబితాను ప్రకటించిన గ్రామాలను మినహాయించి ఆయా మండలాల్లోని తక్కిన పల్లెల్లో అర్హుల ఎంపికపై దృష్టి సారించారు. రాష్ట్రంలో అందిన దరఖాస్తుల మేరకు ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా గతంలోనే దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి పూర్తి వివరాలు నమోదు చేశారు. త్వరలో అర్హులైన వారందరికీ రేషన్‌కార్డులు (Ration Cards)ఇస్తామని కూడా పొన్నం వెల్లడించారు. ఇప్పటికే కొన్ని హామీలను నెరవేర్చరామని, త్వరలో మిగతా హామీలను కూడా అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక స్థితి మందగించడంతో తులం బంగారం ఆలస్యమవుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasreddy) చెప్పారు. ఇచ్చిన ప్రతి మాటనూ నిలబెట్టుకుంటామని వెల్లడించారు.
……………………………………………..