
* బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాం
* జాకీ పెట్టిలేపినా బీఆర్ఎస్ లేవదు
* కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్, (ప్రజాపోరు): రాష్ట్రంలో పాలన అదుపు తప్పిందని.. కాంగ్రెస్‌కు పాలన చేతకావడం లేదని కేంద్ర మంత్రి బండిసంజయ్ అన్నారు. బీజేపీ నేత రాజాసింగ్ కామెంట్స్‌పై బండి సంజయ్ స్పందించారు. బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీల మధ్య రహస్య సమావేశాలు జరిగి ఉండవచ్చని చెప్పారు. రాజాసింగ్ చేసిన కామెంట్లను తాను చూడలేదని బండి సంజయ్ అన్నారు. శనివారం కరీంనగర్లో బండి సంజయ్ పర్యటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. బీజేపీకి ఎవరితోనూ రహస్య ఎజెండాలు, సమావేశాలు ఉండవని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలు.. బీజేపీని అడిగే ఇచ్చారా అని ప్రశ్నించారు. పంటలు ఎండుతుంటే కాంగ్రెస్‌కు పట్టదా అని నిలదీశారు. బీఆర్ఎస్ను జాకీ పెట్టి లేపినా ఇక లేవదని విమర్శించారు. డిలీమిటేషన్‌పై ఎలాంటి నిర్ణయం జరగలేదని అన్నారు. ఒక వర్గం, ప్రాంతం కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోదని తేల్చిచెప్పారు. కేంద్రం ప్రకటన చేయకముందే ప్రతిపక్షాలు హడావుడి చేస్తున్నాయని అన్నారు. హైదరాబాద్ డ్రగ్స్‌కు అడ్డాగా మారిందని బండి సంజయ్ ఆరోపించారు.
………………………….