
* వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సమీక్షా
ఆకేరున్యూస్, హన్మకొండ: ప్రభుత్వ సంస్థల భవనాలకు అనువైన ప్రభుత్వ భూములు గుర్తించాలని వరంగల్ పశ్చిమ నియోజక వర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధికారులకు సూచించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సమీక్షా నిర్వహించారు. హనుమకొండ వరంగల్ పశ్చిమ నియోజక వర్గంలోని వివిధ అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డిల సమక్షంలో రెవెన్యూ, కుడా, ఆర్ అండ్ బీ, స్కిల్ డెవలప్మెంట్, ఇతర శాఖల అధికారులతో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజక వర్గం లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఇంటేగ్రేటెడ్ మోడల్ స్కూల్ ఏర్పాటు, కాజీపేట బస్టాండ్, కాజీపేట దర్గా ఆర్వోబీ, తదితర అభివృద్ధి అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ సంస్థల భవనాలకు అనువైన ప్రభుత్వ భూములను గుర్తించాలని, ఆ భూముల సర్వే రిపోర్ట్ ను అధికారులు అందజేయాలన్నారు. అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, కాజీపేట తహసీల్దార్ బావు సింగ్, కుడా పీవో అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………..