
* ఇరు వర్గాలు రాజీకి రావాలని సూచన
ఆకేరు న్యూస్ డెస్క్ : కార్మికులకు,నిర్మాతలకు మధ్య జరుగుతున్న టాలీవుడ్ సమ్మ 18 వ రోజుకు చేరింది. ఈ నేపధ్యంలో టాలీవుడ్ బంద్ పై ప్రభుత్వం సీరియస్ అయింది. ఇరు వర్గాలు రాజీకి రావాలని లేదంటే లేబర్ కమిషన్ ను రంగంలోకి దించే అవకాశాలు ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా కార్మికుల డిమాండ్లు ప్రొడ్యూసర్ల కండీషన్లను పరిగణలోకి తీసుకొని ఇరు వర్గాలకు అంగీకరయోగ్యంగా సమస్యను పరిష్కరించే దిశలో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం చాంబర్ ప్రతినిధులు నిర్మాతలతో చర్చలు జరుపుతున్నారు. మద్యాహ్నం ఫెడరేషన్ సభ్యులతో చర్చలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సమస్యను మెగాస్టార్ చిరంజీవి దృష్టికి తీసుకెళ్లారు. చిరంజీవి నివాసంలో ఇరువర్గాలు తమ తమ సమస్యలను చిరంజీవికి తెలిపారు. ఈ నేపధ్యంలో చిరంజీవి పలు సూచనలు సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. రానున్న 24 గంటల్లో సమస్యల పరిష్కారానికి ఇరు వర్గాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
……………………………………………