– హుజురాబాద్ ప్రజల్లో మార్పు వచ్చింది
– స్థానిక ఎన్నికల్లో బీజేపీని గెలిపించండి
– మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్
ఆకేరు న్యూస్, కమలాపూర్: ప్రభుత్వ పనులు ఎవరి జాగీరు కాదని, ప్రజల జాగీరు అని, ఎవరు అధికారంలో ఉన్న ప్రజలకు కావలసినవి చేయాల్సిందేననీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. గురువారం కమలాపూర్ మండల కేంద్రం లోని రావి చెట్టు వద్ద ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీలో చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శనిగరం,వంగపల్లి,కమలాపూర్, మడిపల్లి, శంభునిపల్లి, గోపాల్ పూర్ గ్రామాలకు చెందిన పలువురు బిజెపిలో పార్టీలో చేరారని ఆయన అన్నారు. వారికి ఈటెల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రజల్లో రెండు సంవత్సరాల తర్వాత మార్పు వచ్చిందని, పాత పద్ధతిలోనే సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రజలు పట్టం కట్టనున్నారని ఈటెల అన్నారు.గ్రామాల వారీగా మండలాలు వారిగా కమిటీలు వేసుకొని స్థానిక సంస్థల ఎన్నికల కోసం సమాయత్తం కావాలని కోరుతున్నాను అన్నారు. మద్యం డబ్బు ప్రలోభాలకు లొంగకుండా బిజెపినీ గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ మెసలి కన్నీరు
గతంలో హనుమకొండ కి వరదలు వచ్చినప్పుడు, సమస్యను పరిష్కరిస్తామన్న ప్రభుత్వం, ఏమీ చేయలేక ముసలి కన్నీరు కారుస్తుందనీ ఈటెల విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి కంటి తుడుపు చర్యగా మాత్రమే హనుమకొండలో పర్యటన చేశాడని , వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని, వాగులు ఉధృతంగా ప్రవహించడం వల్ల రైతుల పంటల్లో కయ్యలు, ఇసుక మేటలు ఏర్పడ్డాయని వాటిని చదును చేసేందుకు ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని అన్నారు.
హుజురాబాద్ చరిత్రలో కాంగ్రెస్ గెలవదు
కాంగ్రెస్ పార్టీ గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనీ..హుజురాబాద్ నియోజకవర్గం లో 1983లో రామచంద్రారెడ్డి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారని, అప్పటినుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ గెలిచింది, గెలువబోయేది లేదని ఈటెల వ్యాఖ్యానించారు.
నా రాజీనామా తోనే సాధ్యమైంది
2021 లో తన రాజీనామా తోనే దళిత బంధు డబ్బులు వచ్చాయని ఈటెల అన్నారు. ఊర్లలో , కాలనీలలో, వాడ వాడన సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయిందని ఈటెల అన్నారు. నాయకులకు లక్షల కొద్ది డబ్బులు వచ్చాయని తన రాజీనామా తోనే ఇదంతా సాధ్యమైందని, నాయకులు జీవితాంతం నా ఫోటోలు పెట్టుకోవాలని అన్నారు.2002 నుంచి దాదాపుగా మూడు తరాలకు నేను నాయకునిగా ఉన్నాను అని ఈటెల అన్నారు. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 90 శాతం గెలిచేదని అన్నారు . హుజురాబాద్ ఎమ్మెల్యే గెలిచి రెండేళ్లు దాటిన తట్టెడు మట్టి పోసిండా అని ప్రశ్నించారు. 2021లో తర్వాత నేను ఇక్కడ రాకుండా ఉండేందుకు కేసీఆర్ అనేక చిల్లర ప్రయత్నాలు చేశారు.చెరపకురా చెడేదవు అన్నట్లుగా.. ఈరోజు వారి బ్రతికేందో, ఆ నాయకుల గతి ఏందో ప్రజలందరికీ అర్థమైంది అని అన్నారు.
ఉప్పల్ రైల్వే స్టేషన్ అంటే ఢిల్లీకి గజ్జు
తెలంగాణ ఉద్యమ కాలాన్ని గుర్తుచేస్తూ మొత్తం రైల్వే స్టేషన్ లలో ఉప్పల్ రైల్వే స్టేషన్ అంటే ఢిల్లీ గజ్జుమనేదనీ, ఫైరింగ్ చేస్తామన్నా కూడా ఒక్కరు కూడా కదలలేదు. తెలంగాణ ఉద్యమంలో దేశానికే గుణపాఠం నేర్పిన గడ్డ హుజరాబాద్ గడ్డ చైతన్యవంతమైందని అన్నారు. అలాంటి హుజురాబాద్ గడ్డపై రాబోయే స్థానిక ఎన్నికలలో సర్పంచి, ఎంపిటిసి,జడ్పిటిసి లను మళ్లీ గెలిపించుకొని హుజురాబాద్ నియోజకవర్గానికి పునర్వైభవం తీసుకురావాలని అన్నారు.

……………………………………………………………………
