 
                * హాజరైన సీఎం రేవంత్ ఇతర మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 12 30 నిమిషాలకు గవర్నర్ జజిష్టుదేవ్ వర్మ మహ్మద్ అజారుద్దీన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క,పిసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ తో పాటు కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ముఖ్యనేతలంతా పాల్గొన్నారు.ప్రభుత్వ సలహాదారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు తదితరులు హాజరయ్యారు. 1963 ఫిబ్రవరి 8 మహమ్మద్ అజీజుద్దీన్, యూసఫ్ సుల్తానా దంపతులకు, హైదరాబాదులో జన్మించాడు. ఆల్ సెయింట్స్ హైస్కూల్లో చదివాడు. నిజాం కళాశాల నుంచి బి.కాం డిగ్రీ పుచ్చుకున్నారు
క్రికెట్ జీవితం
క్రికెట్ లో అడుగు పెడుతూనే సంచలనాలు సృష్టించారు. ఇతని మణికట్టు ఆట శైలికి పేరు పొందాడు. ఇతను మొట్టమొదటిసారిగా 1984 డిసెంబరు 31 న కలకత్తాలో భారత్ ఇంగ్లండు దేశాల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ తో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించారు. మొదటి ఇన్నింగ్స్ లోనే 322 బంతులు ఎదుర్కొని 110 పరుగులు చేశాడు. తర్వాత ఆడిన రెండు టెస్టు మ్యాచుల్లోనూ అజర్ రెండు శతకాలు సాధించాడు. మొత్తం 99 టెస్టులు మరియు 334 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. అతని కెప్టెన్సీలో, జట్టు 1990–91 మరియు 1995 ఆసియా కప్‌లలో గెలిచింది మరియు 1996 ప్రపంచ కప్‌లో సెమీ-ఫైనల్స్‌కు చేరుకుంది
రాజకీయ జీవితం
ముహమ్మద్ అజహరుద్దీన్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో
జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మొరాదాబాద్ నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ 
అభ్యర్థి కున్వర్ సర్వేష్ కుమార్ సింగ్‌పై 49,107 ఓట్ల మెజారిటీతో గెలిచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2014 లోక్‌సభ ఎన్నికలలో రాజస్థాన్‌లోని టోంక్ సవాయీ మాధోపుర్ నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి సుఖ్బీర్ సింగ్ జౌనపురియా చేతిలో 1,35,506 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 2023లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీఆర్ ఎస్ అభ్యర్థి మాగుంట గోపినాథ్ చేతిలో ఓడిపోయారు. తరువాత రేవంత్ రెడ్డి అజారుద్దీన్ ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించారు.
……………………………………………………

 
                     
                     
                    