
ఆకేరున్యూస్, హైదరాబాద్: పదో తరగతి మార్కుల మెమోలను ఎలా ముద్రించాలన్న అంశానికి ప్రభుత్వం ఓ నిర్ణయానిక వచ్చింది. 24-25 విద్యా సంవత్సరానికి పదో తరగతి మెమోలపై మార్కులతో పాటు గ్రేడ్స్ను సైతం ముద్రించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా తాజాగా ఉత్తర్వులు విడుదల చేశారు. పదో తరగతిలో ఈ విద్యాసంవత్సరం నుంచి గ్రేడిరగ్ విధానాన్ని తీసేశారు. గ్రేడ్ల స్థానంలో మార్కుల విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఇంటర్నల్స్ను రద్దుచేయాలని తీసుకున్న నిర్ణయం ఆలస్యం కావడంతో ఈ ఒక్క ఏడాదికి ఇంటర్నల్స్ ఉంటాయని ప్రకటించారు. మెమోలపై మార్కులు ఎలా ముద్రించాలన్న అంశంపై ఏర్పాటు చేసిన కమిటీ పలు సిఫారసులు చేసింది. దీంతో ఫలితాల విడుదలకు లైన్ క్లియరైంది. రెండు, మూడు రోజుల్లో ఫలితాలు విడుదల కానున్నాయి.
………………………………………