
* ఏఐటియుసి
ఆకేరు న్యూస్ , ములుగు : జిల్లావ్యాప్తంగా గ్రామ పంచాయతీల కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎఐటియుసి నాయకులు జిల్లా కలెక్టర్ దివాకర కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి అనుబంధ గ్రామ పంచాయతీ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భుడిమె సదయ్య,, ఏఐటియుసి మండల ఉపాధ్యక్షులు బోడ రమేష్ గారలు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ లలో మూడు నెలల నుండి ఆరు నెలల వరకు వేతనాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుత దసరా పండుగ సందర్భంగా నైనా పస్తులు ఉండకుండా వెంటనే వేతనాలు చెల్లించాలని కోరారు. దీనిపై కలెక్టర్ స్పందించి వెంటనే వేతనాలు విడుదల చేసి కార్మికులకు అందించి ఆదుకోవాలని కోరారు.
………………………………………………