* అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ
ఆకేరు న్యూస్,తొర్రూరు : వరంగల్ నుంచి ఖమ్మం వెళ్లే జాతీయ రహదారిపై ఓ గ్రానైట్ లారీ భీబత్సం సృష్టించింది. తొర్రూరు మండలం నాంచారి మడూరు వద్ద గ్రానైట్ లారీ అదుపు తప్పి రహదారి పక్కనున్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఇంట్లోకి దూసుకెళ్లడంతో లక్ష్మీ అనే మహిళకు తీవ్రంగా గాయాలయ్యాయి, తెలంగాణ నుంచి ఆంధ్రకు వెళ్లాలంటే ఇదే రహదారిపై వెళ్లాల్సి ఉంటుంది. రోజూ వందల సంఖ్యలో గ్రానైట్ లారీలు కరీంనగర్ నుంచి కాకినాడ పోర్టుకు గ్రానైట్ ను తీసుకెళ్తుంటాయి. గ్రానైట్ లారీలతో వరుస ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు నష్టనివారణ చర్యలు చేపట్టడం లేదని రహదారిపై ఉన్న గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, రహదారులను మరింత మెరుగు పర్చాల్సిన అవసరం ఉందంటున్నారు.
…………………………………………………
