
* జమ్ముకశ్మీర్లో వరద విలయతాండవం
* అధికారికంగా 60కు పెరిగిన మరణాలు
ఆకేరు న్యూస్, డెస్క్ : జమ్ముకశ్మీర్లో వరద విలయతాండవం చేస్తోంది. ఊళ్లకు ఊళ్లను ముంచేస్తోంది. ప్రధానంగా చోసితి గ్రామంలోని దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. క్లౌడ్ బరస్ట్ (Cloud burst) కారణంగా తీవ్ర విపత్తు సంభవించింది. వందల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం నాటికి మృతుల సంఖ్య దాదాపు 60కు చేరుకుంది. చనిపోయిన వారిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున కిస్త్వార్లోని మాచైల్ మాత ఆలయానికి వస్తూ ఉంటారు. భక్తులకు చషోటి గ్రామమే (Chashoti Village) బేస్ పాయింట్. ఇక్కడ యాత్రికుల కోసం సామూహిక వంటశాలలు ఏర్పాటు చేస్తారు. భక్తులు ఇక్కడే వాహనాలు వదిలి, కాలినడకన మాచైల్ మాత గుడికి వెళతారు. గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా మెరుపు వరదలు రావడంతో భక్తుల టెంట్లు, దుకాణాలు, వసతి సౌకర్యాలు, సెక్యూరిటీ అవుట్ పోస్టులన్నీ కొట్టుకుపోయాయి. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.
………………………………….