
* కౌన్సిల్ ఆమోదం.. గతంతో పోల్చుకుంటే భారీగా పెరుగుదల
ఆకేరు న్యూస్, వరంగల్ : రూ.1071,48 కోట్ల అంచనా వ్యయంతో గ్రేటర్ వరంగల్ (Greater Warangal) బడ్జెట్ను రూపొందించారు. మేయర్ గుండు సుధారాణి (Gundu Sudharani) బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి చెందిన ఈ బడ్జెట్ను వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు ఆమోదించారు. గతేడాది రూ. 650.12 కోట్లతో బడ్జెట్ ఉండగా, ఈసారి అంచనాలకు మించి బడ్జెట్ రూపొందించడం గమనార్హం. వచ్చే సంవత్సరం గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉండనుండడం, తెలంగాణ రెండో రాజధానిగా వరంగల్ ను తీర్చిదిద్దుతామన్న ప్రకటనల నేపథ్యంలో బడ్జెట్ ప్రతిపాదనలను భారీగా పెంచినట్లు తెలుస్తోంది. నగరాన్ని అన్ని రకాలుగానూ అభివృద్ధి చేస్తామని మంత్రులు(MInisters) పదే పదే చెబుతున్నారు. అందులోభాగంగానే బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే, గత ఏడాది బడ్జెట్ రూ. 650.12 కోట్లుగా ఉన్నప్పటికీ, అందులో సొంత ఆదాయంగా రూ.150 కోట్లు, డిపాజిట్ల రూపంలో 3.5 కోట్లు మాత్రమే సమకూరాయి. మిగతా ఆదాయం కేంద్ర, రాష్ట్ర గ్రాంట్ల ద్వారా సమకూరుతుందని భావించారు. ఆశించినస్థాయిలో నిధులు రాక, దాదాపు 350 కోట్ల లోటుబడ్జెట్తో 2024-25 ఆర్థిక సంవత్సరాన్ని నెట్టుకొచ్చినట్లు సమాచారం.
…………………………….