
* ఆశావహుల్లో ఉత్కంఠ
ఆకేరున్యూస్ డెస్క్ : ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం
గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సమాచారం అందజేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రి వర్గంలో ఆరు స్థానాలు ఖాళీగా ఉండగా ప్రస్తుతం మూడు లేదా నాలుగు మంత్రిపదవులను భర్తీ చేస్తారని అనుకుంటున్నారు. ఈ క్రమంలో రెండు రెడ్డి సామాజిక వర్గానికి ఒకటి బీసీ సామాజిక వర్గానికి కేటాయిస్తారని భావిస్తున్నారు. నాలుగో స్థానం భర్తీ చేయాలనుకుంటే మైనారిటీ వర్గానికి కేటాయిస్తారని భావిస్తున్నారు. మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ల పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. మంత్రి వర్గ విస్తరణపై శనివారం సాయంత్రానికి రాజభవన్ నుండి అధికారికంగా ప్రకటన వెలవడవచ్చని భావిస్తున్నారు.
……………………………………………….