
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలను మంగళవారం సాయంత్రం టీజీపీఎస్సీ (Tgpsc) రిలీజ్ చేసింది. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి 2024 డిసెంబర్ 15, 16న ఈ పరీక్షలు నిర్వహించారు. పరీక్షలకు సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్టును టీజీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచింది. 783 పోస్టుల భర్తీకి 2022లో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలకాగా, 5 లక్షలకుపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ పరీక్షలకు 46 శాతం మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. అంటే సగానికి సగం మంది మాత్రమే గ్రూప్-2 పరీక్షలను రాశారు.
టాప్ టెన్ అభ్యర్థుల జాబితా ఇదే..
నారు వెంకట హరవర్ధన్ (ఓసీ) (మల్టీజోన్ -1) – 447.088
వడ్లకొండ సచిన్ (ఓసీ) (మల్టీజోన్ -1) – 444.754
బీ మనోహర్ రావు (బీసీ-డీ) (మల్టీజోన్ -2) – 439.344
శ్రీరామ్ మధు (బీసీ-బీ) (మల్టీజోన్ -2) – 438.972
చింతపల్లి ప్రీతమ్ రెడ్డి(ఓసీ) (మల్టీజోన్ -1) – 431.102
అఖిల్ ఎర్ర (ఓసీ) (మల్టీజోన్ -2) – 430.807
గొడ్డేటి అశోక్ (బీసీ-బీ) (మల్టీజోన్-1) – 425.842
చిమ్ముల రాజశేఖర్(ఓసీ) (మల్టీజోన్-2) – 423.933
మేకల ఉపేందర్ (బీసీ-డీ) (మల్టీజోన్-1) – 423.119
కరీంగు నరేశ్(బీసీ-బీ) (మల్టీజోన్ -2) – 422.989
……………………………………