Gundu Sudharani KUDA Chairperson
* చైర్ పర్సన్‌గా బాధ్యతలు
* మెరుగైన మౌలిక వసతులే లక్ష్యం
* నగర అభివృద్ధికి పెద్దపీట అని స్ఫష్టీకరణ
ఆకేరు న్యూస్, వరంగల్:
కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (KUDA) నూతన చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి శనివారం ప్రమాణ స్వీకారం చేసి, అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. హనుమకొండలోని కుడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అధికారులు, కార్యాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆమెకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గుండు సుధారాణి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కుడా పరిధిలోని ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని చెప్పారు. ప్రజలకు అవసరమైన మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తమ ప్రాథమిక లక్ష్యమని, నగరాభివృద్ధికి పూర్తి ప్రాధాన్యం ఇస్తూ సుపరిపాలన అందిస్తామని ఈ సందర్భంగా ఆమె చెప్పారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
