
* ఎన్కౌంటర్లో మృతిచెందిన 20 మంది మావోయిస్టులు
ఆకేరున్యూస్, ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి తుపాకుల మోత మోగింది. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య శనివారం ఉదయం జరిగిన భీకర పోరులో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. సుక్మా జిల్లా గోగుండ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు సీఆర్పీఎఫ్, డీఆర్జీ భద్రతా దళాలు సంయుక్తంగా సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించగా.. తారాసపడిన మావోయిస్టులు.. జవాన్లపై కాల్పులు జరిపారు. అప్పటికే ఆ ప్రాంతంలో భారీగా మోహరించిన భద్రతా దళాలు చుట్టూముట్టి ఎదురుకాల్పులు ప్రారంభించగా 20 మంది మావోయిస్టులు మృతిచెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆ ప్రాంతంలో ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.
………………………………….