
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ బీఆర్ ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భారీతీయ జనతా పార్టీలో ఆదివారం చేరారు. నాంపెల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు రామచందర్రావు పార్టీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించడంతోపాటు సభ్యత్వం అందించారు. బీజేపీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బీజేపీలోకి బాలరాజు రావడం హర్షణీయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి గువ్వల బాలరాజు సేవలు వినియోగించుకుంటామని అన్నారు. గువ్వల బాలరాజు మాట్లాడుతూ బీజేపీలో సామాన్య కార్యకర్తగా ఉంటానని, తాను పార్టీ మారడానికి అనేక కారణాలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే అంజిరెడ్డి, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
…………………………………………………