ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జనగామ జిల్లా చిల్పూర్ మండలం పల్లగుట్ట వాస్తవ్యుడు చిల్పూర్ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు జన్మదిన వేడుకలు ఆదివారం ఆయన స్వగ్రామం పల్లగుట్టలో ఘనంగా జరిగాయి. సర్పంచులు మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామస్తుల సమక్షంలో సమక్షంలో శ్రీధర్ రావు 61వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఐదు పర్యాయాలు దేవస్థానం చైర్మన్ గా వరుసగా ఎన్నికైన శ్రీధర్ రావు జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషులు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు ఎనగందుల నరసింహారెడ్డి, లావణ్య మల్లారెడ్డి, మేనక సుధాకర్, నలిమల అనిత నవీన్, భూక్య వెంకటేష్, సాంబరాజు, ఎండి రఫీ, మాజీ జెడ్పిటిసి స్వామి నాయక్, మాజీ ఎంపీపీ బొమ్మిశెట్టి సరిత బాలరాజు, మండల పార్టీ అధ్యక్షుడు గడ్డమీద సురేష్, దేవస్థానం డైరెక్టర్లు రత్నాకర్ రెడ్డి, వేముల వెంకటేశ్వర్లు, ఘనగోని రమేష్, కందూరి రంగరాజు, గొల్లపల్లి వాసు, భూక్య శీను, బుల్ల కుమారస్వామి, ఎడ్ల యాదగిరి, మాజీ సర్పంచులు పేరాల సుధాకర్, ఎర్రబెల్లి చేరాలు, మారబోయిన ఎల్లయ్య, బత్తుల సూర్యనారాయణ, వెన్నపూస కుమార్, నాయకులు రంగు రమేష్, తౌటి సునీల్, పులికాసి రాజయ్య, మోటం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
” రక్తదాన శిబిరం
చిల్పూర్ దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు జన్మదిన సందర్భంగా పల్లగుట్ట గ్రామంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో దాదాపు 20 మంది యువకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో జనగామ గవర్నమెంట్ ఆసుపత్రి డాక్టర్లు అన్వర్, ప్రవీణ్, సిబ్బంది వినయ్, అభిషేక్, యమునా, జ్యోత్స్నా, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు
