ఆకేరు న్యూస్, హన్మకొండ: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులతో చారిత్రక జంట నగరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. జాతర గమ్యస్థానానికి వెళ్లే క్రమంలో భక్తులు హన్మకొండలోని ప్రసిద్ధ ఆలయాలను దర్శించుకుంటున్నారుదీంతో ఒక్కసారిగా ఆలయ ప్రాంగణాలు జనసంద్రంగా మారాయి.ముఖ్యంగా వేయి స్తంభాల గుడి మరియు హన్మకొండలోని భద్రకాళి అమ్మవారి ఆలయం భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయాయి..తెలంగాణ ప్రాంతం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకుని, మేడారానికి పయనం అవుతున్నారు.ఇగ మేడారం వెళ్లే దారిలో హన్మకొండ ప్రధాన నగరం కావడంతో భక్తులు ఇక్కడ బస చేసి ఆలయాలను సందర్శిస్తున్నారు. మేడారం వెళ్ళే ముందు భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు తీసుకోని, చారిత్రక కట్టడాలను చూడాలనే ఉద్దేశంతో వేయి స్తంభాల గుడిని సందర్శిస్తున్నారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీలు మరియు పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకొని ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్ల నిర్వహణ, తాగునీరు మరియు ప్రసాదాల పంపిణీలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. హన్మకొండ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
…………………………………………………..
